»Mahesh Babu And Ram Charan Party Why Not Go To The Reception
Varun-Luv: మహేష్ బాబు, రామ్ చరణ్ పార్టీ.. అందుకే రిసెప్షన్‌కు వెళ్లలేదా?
ఈ మధ్య స్టార్ హీరోలంతా తరచుగా కలుస్తూనే ఉన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుండడంతో.. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మహేష్ బాబు, రామ్ చరణ్ ఫ్యామిలీతో కలిసి పార్టీ చేసుకున్నారు. వరుణ్ తేజ్ రిసెప్షన్లో చరణ్ కనిపించకపోవడం హాట్ టాపిక్‌గా మారింది.
Mahesh Babu and Ram Charan party.. Why not go to the reception?
Varun-Luv: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి డెస్టినేషన్ వెడ్డింగ్ నవంబర్ 1న ఇటలీలో గ్రాండ్‌గా జరిగింది. 5వ తేదీన ఆదివారం హైదరాబాద్‌లో మరింత గ్రాండ్‌గా రిసెప్షన్ ఇచ్చారు. విందుకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. పెళ్లిలో కనిపించిన మెగా ఫ్యామిలీ హీరోలు మాత్రం రిసెప్షన్‌కి డుమ్మా కొట్టారు. వరుణ్, లావణ్య రిసెప్షన్ ఫొటోలు బయటకి రాగా.. అందులో ఎక్కడా కూడా రామ్ చరణ్, అల్లు అర్జున్ కనిపించలేదు. వీళ్లు నిజంగానే వరుణ్ తేజ్ రిసెప్షన్‌కు వెళ్లలేదా? లేదంటే ఆ ఫొటోలు బయటకి రాలేదా? అనే సందేహాలు వెలువడుతున్నాయి.
మరోవైపు రామ్ చరణ్, మహేష్ బాబు వేరే పార్టీకి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీపావళి సందర్భంగా నిర్వహించిన ఓ పార్టీలో చరణ్, మహేష్ కుటుంబంతో కలిసి సందడి చేశారు. మేఘా ఇంజినీరింగ్ కళాశాల అధినేత మేఘా కృష్ణారెడ్డి, మేఘా సుధారెడ్డి నిర్వహించిన ప్రత్యేక పార్టీకి పలువురు స్టార్స్ అటెండ్ అయ్యారు. వారిలో రామ్ చరణ్, ఉపాసన.. మహేష్ బాబు, నమ్రత కూడా ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించిన ఫొటోలను నమ్రత సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో వరుణ్ తేజ్ రిసెప్షన్లో చరణ్ కనిపించలేదనే టాక్ నడుస్తోంది. మరో వెర్షన్ ప్రకారం.. ఈ పార్టీ రెండు రోజుల క్రితం జరిగిందని సమాచారం. కాబట్టి.. రామ్ చరణ్, వరుణ్ రిసెప్షన్‌కు వెళ్లి ఉంటాడని అంటున్నారు. ఏదేమైనా.. అసలు మ్యాటర్ మాత్రం తేలాల్సి ఉంది.