»Vizag Steel Plant Privatisation On Hold Says Union Minister Faggan Singh Kulaste
Vizag Steel Plant పై కేంద్రం యూటర్న్.. కేంద్ర మంత్రి సంచలన ప్రకటన
ఇప్పటికిప్పుడు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరంగా చేయాలని భావించడం లేదు’ అని ప్రకటించాడు. ఈ ప్రకటనతో కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పై యూటర్న్ తీసుకున్నట్టు కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్న అంశం విశాఖ ఉక్కు కర్మాగారం (Vizag Steel Plant) ప్రైవేటీకరణ అంశం. బీఆర్ఎస్ పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్ ను కొనుగోలు చేస్తుందనే వార్తలతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో స్టీల్ ప్లాంట్ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే (Faggan Singh Kulaste) సంచలన ప్రకటన చేశాడు. ‘ఇప్పటికిప్పుడు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరంగా చేయాలని భావించడం లేదు’ అని ప్రకటించాడు. ఈ ప్రకటనతో కేంద్ర ప్రభుత్వం (Govt of India) స్టీల్ ప్లాంట్ పై యూటర్న్ తీసుకున్నట్టు కనిపిస్తోంది.
‘ఇప్పటికిప్పుడు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరంగా చేయాలని అనుకోవడం లేదు దానికంటే ముందు రాష్ట్రీయ ఇష్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) (Rashtriya Ispat Nigam)ను బలోపేతం చేసే పనిలో ఉన్నాం. స్టీల్ ప్లాంట్ లో కొన్ని కొత్త విభాగాలు ప్రారంభిస్తున్నాం. ముడిసరకు పెంపొందించే ప్రక్రియపై దృష్టి పెట్టాం. పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు ప్లాంట్ పనిచేసే ప్రక్రియ జరుగుతోంది. దీనిపై ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తాం. ఆర్ఐఎన్ఎల్ అధికారులతో సమావేశం అవుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం (Govt of Telangana) బిడ్డింగ్ లో పాల్గొనడం ఓ ఎత్తుగడ మాత్రమే’ అని ఫగ్గన్ సింగ్ తెలిపాడు.