హుస్సేన్ సాగర్ తీరంలో ఎన్టీఆర్ గార్డెన్ ఆనుకుని ఉన్న స్థలంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ రేపు (శుక్రవారం) ఆవిష్కరిస్తారు.
125 Feet Ambedkar Statue unveil:భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ( Ambedkar) 125 అడుగుల విగ్రహాన్ని (125 foot) మరికొన్ని గంటల్లో జాతికి అంకితం చేస్తారు. హుస్సేన్ సాగర్ తీరంలో ఎన్టీఆర్ గార్డెన్ (ntr garden) ఆనుకుని ఉన్న స్థలంలో విగ్రహాం నెలకొల్పారు. అంబేద్కర్ (Ambedkar) జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ శుక్రవారం ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ (prakash Ambedkar) పాల్గొంటారు. మంత్రులు (ministers), ఎంపీలు (mp), ఇతర ప్రజా ప్రతినిధులు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరవుతారు. దేశంలో ఉన్న విగ్రహాల్లో (statue) ఇదే ఎత్తయినది అనే సంగతి తెలిసిందే.
పార్లమెంట్ (parliament) ఆకారంలో 50 అడుగుల పీఠం నిర్మించి.. దానిపై అంబేద్కర్ (Ambedkar) లోహ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి భారీ సంఖ్యలో జనం వచ్చేలా ఏర్పాట్లు చేశారు. రవాణా శాఖ 750 బస్సులను (750 buses) వివిధ ప్రాంతాలకు పంపిస్తోంది. 50 వేల మంది (50 thousand) కూర్చొనేలా ఏర్పాటు చేశారు.
అంబేద్కర్ (Ambedkar) విగ్రహాం కోసం 11.80 ఎకరాల స్థలం కేటాయించి.. విగ్రహాం తయారీకి ప్రభుత్వం రూ.146.50 కోట్లు ఖర్చు చేసింది. విగ్రహాం కింద పీఠంలో 27,556 చదరపు అడుగుల స్థలం ఉంది. ఇందులో అంబేద్కర్ (Ambedkar) మ్యూజియం, అంబేద్కర్ (Ambedkar) జీవితానికి సంబంధించి ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేస్తారు. లైబ్రరీ కూడా నెలకొల్పుతారని తెలిసింది.
విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ. 10 కోట్ల (10 crores) నిధులను విడుదల చేసింది. 2 లక్షల మంచి నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, 80 వేల స్వీట్ ప్యాకెట్స్ అందజేస్తారు. 20 మంది బౌద్ద గురువులు విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రార్థనలు చేస్తారు. తర్వాత హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపిస్తారు.
మరో 7, 8 నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. సరిగ్గా ఎన్నికలకు ముందే అంబేద్కర్ భారీ విగ్రహాం ఆవిష్కరణ జరగనుంది. దళిత సామాజిక వర్గం ఓట్లు దండుకునేందుకు ఇప్పుడు కార్యక్రమం ఏర్పాటు చేశారని విపక్షాల వాదన. నిజమేనని పొలిటికల్ ఆనలిస్టులు వత్తాసు పలుకుతున్నారు. అయితే తాము ఇచ్చిన హామీ మేరకు నిర్మించామని అధికార పార్టీ చెబుతోంది. అంతేకాదు కొత్తగా నిర్మించిన సచివాలయానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టామని చెబుతోంది.