NLG: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహ స్వామికి 116 రోజులకు గాను భక్తులు సమర్పించిన కానుకల ద్వారా మొత్తం రూ.21,40,040 ఆదాయం వచ్చినట్లు ఆలయ ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్ కుమార్, ఈవో నవీన్లు ఇవ్వాళ తెలిపారు. ఇందులో వివిధ ఆర్జిత సేవల టికెట్లు, భక్తుల కానుకల ద్వారా రూ.20,86,660, నిత్య అన్నదాన హుండీ ద్వారా రూ.53,380 వచ్చాయన్నారు.