RR: షాద్నగర్ పట్టణంలో “రంగు ఉత్సవ్” పేరిట నిర్వహించిన హోలీ వేడుకల్లో సినీనటి హెబ్బా పటేల్ సందడి చేసింది. హోలీ పండుగను పురస్కరించుకుని షాద్నగర్ పట్టణానికి సినీనటి రావడంతో హెబ్బాను చూసేందుకు స్థానికులు భారీగా తరలి రావడంతో ప్రాంతం కోలాహాలంగా మారింది. ఈ నేపథ్యంలో స్థానికులు అందరితో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొని ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.