E.G: ఉప రాష్ట్రపతిగా చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ ఎన్నిక కావడం పట్ల బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గోపి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం బీజేపీ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం ఉప రాష్ట్రపతి బాధ్యతలలో ప్రధానమైనవన్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ ఈ బాధ్యతల్ని రాజకీయ కోణాల్లో చూడటం బాధాకరమని తెలిపారు.