TPT: కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని నెల్లూరు జిల్లా MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దర్శించున్నారు. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.