E.G: నిడదవోలు కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాల గోడపత్రికను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈనెల 22 నుంచి ఆలయంలో దసరా వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంటా ఆయన మాట్లాడుతూ.. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను సమయానికి పూర్తి చేయాలని ఆలయ అధికారులు, సిబ్బందికి సూచించారు.