అన్నమయ్య: రాజంపేట మండలం నారంరాజుపల్లి ఆకేపాడులో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో 11, 9 తరగతుల్లో ఏర్పడిన ఖాళీల్లో భర్తీ చేయడానికి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ గంగాధరన్ తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి 10, 8 తరగతి చదివే విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. అనంతరం ఈనెల 23 లోపు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని స్పష్టం చేశారు.