»Minister Peddireddy Inaugurated The Electrical Safety Workshop
Tirupati : ఎలక్ట్రికల్ సేఫ్టీ వర్క్ షాప్ను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి
తిరుపతి (Tirupati) లో ఎలక్ట్రికల్ సేఫ్టీ వర్క్ షాప్ను మంత్రి పెద్దిరెడ్డి (Minister Peddireddy) రామచంద్రారెడ్డి ప్రారంభించారు.ఎలక్ట్రికల్ సేఫ్టీ (Electrical Safety) చాలా ముఖ్యమని, చిన్న అలసత్వం కూడా అత్యంత ప్రమాదకరమనిపెద్దిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ శాఖ (Electricity Department) ఒక ప్రధాన పాత్ర పోషిస్తుందని. ఆర్థిక అభివృద్ధికి విద్యుత్ శాఖ చాలా ముఖ్యమని ఇటీవల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (Global Investors Summit) మరోసారి రుజువైందని ఆయన వెల్లడించారు.
తిరుపతి (Tirupati) లో ఎలక్ట్రికల్ సేఫ్టీ వర్క్ షాప్ను మంత్రి పెద్దిరెడ్డి (Minister Peddireddy) రామచంద్రారెడ్డి ప్రారంభించారు.ఎలక్ట్రికల్ సేఫ్టీ (Electrical Safety) చాలా ముఖ్యమని, చిన్న అలసత్వం కూడా అత్యంత ప్రమాదకరమనిపెద్దిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ శాఖ (Electricity Department) ఒక ప్రధాన పాత్ర పోషిస్తుందని. ఆర్థిక అభివృద్ధికి విద్యుత్ శాఖ చాలా ముఖ్యమని ఇటీవల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (Global Investors Summit) మరోసారి రుజువైందని ఆయన వెల్లడించారు. అనేక రకాల సమస్యలను అధిగమించేందుకు అందరూ సమన్వయంతో కృషి చేయాలని కోరారు.
టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) భారీగా ప్రచారం చేసుకున్న కూడా ఆయన పెట్టిన సమ్మిట్ కు సంబంధించి ఎక్కడ ఒక పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదని గుర్తు చేశారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తె అందులో 9 లక్షల కోట్లు విద్యుత్ శాఖకు వచ్చాయన్నారు.ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇప్పటికే సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేశాం.. సబ్ స్టేషన్ (Sub station)లెవల్ లో కూడా కమిటీ వేస్తే, వారి సమన్వయంతో మరింత ముందుకు సాగుదామని మంత్రి తెలిపారు.రైతులకు 9 గంటల పగటి పూటే ఉచిత విద్యుత్ ఇస్తున్నామని.. కేవలం గృహ వినియోగదారులకు మాత్రమే స్మార్ట్ మీటర్లు(Smart meters) పెట్టాలని భావిస్తున్నామన్నారు. వ్యవసాయం దండగ అని చంద్రబాబు అన్న విషయాలను రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదని స్పష్టం చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.