ఆస్ట్రేలియాలో కొంతకాలంగా వలసదారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. దీనిపై సెనెటర్ జసింటా ప్రిన్స్ మాట్లాడుతూ.. భారత్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియాలో పెరుగుతున్న జీవనవ్యయాలకు భారత వలసదారులను నిందిస్తూ ఆమె విమర్శలు చేశారు. దీంతో ఆమె మాటలను ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఖండించారు. వెంటనే ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.