ప్రకాశం: సీఎం చంద్రబాబు నీతి నిజాయితీ, విలువలు కలిగిన వ్యక్తి అని కొండేపి ఎమ్మెల్యే, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజున అన్యాయంగా, అక్రమంగా చంద్రబాబును అరెస్టు చేశారన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది చీకటి రోజని, వైసీపీ పతనానికి నాంది పలికిన రోజు అన్నారు.