TG: గ్రూప్-1పై వేర్వేరుగా దాఖలైన పలు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. సంబంధిత పిటిషన్లపై జూలై 7న వాదనలు విన్న జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు కీలక తీర్పు ఇచ్చారు. ఇప్పటికే, గ్రూప్-1 పరీక్షల ఎంపిక ప్రక్రియ పూర్తయినప్పుటికీ హైకోర్టులో కేసు విచారణ దృష్ట్యా కమిషన్ నియామక ఉత్తర్వులు నిలిపివేసిన విషయం తెలిసిందే.