TPT: బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం SP హర్షవర్ధన్ రాజు తిరుమలలో తనిఖీలు చేపట్టారు. గరుడ సేవకు సంబంధించి భక్తులను ఔటర్ రింగ్ రోడ్డు నుంచి క్యూలైన్లలోకి తీసుకునే విధానం, గరుడ వాహనం ప్రారంభ సమయం, ప్రధాన గేట్ల ద్వారా వచ్చే భక్తుల తాకిడిపై ఆయన ఆరా తీశారు. అనంతరం మాడ వీధులు, ATGH సర్కిల్ నుంచి నంబీ సర్కిల్ వరకు పరిశీలించారు.