చిత్తూరు: ప్రత్యేక విద్యుత్ ఆదాలత్ రేపు(బుధవారం) జీడీనెల్లూరు డీఈ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు ట్రాన్స్కో రూరల్ ఈఈ సురేష్ తెలిపారు. ఇందులో భాగంగా విశ్రాంత జడ్జి శ్రీనివాస ఆంజనేయ మూర్తి, ఆర్థికసభ్యులు మధుకుమార్, స్వతంత్రసభ్యులు విజయలక్ష్మి కార్యక్రమానికి హాజరుకానున్నట్లు వెల్లడించారు. చిత్తూరు జిల్లాలోని వారు తమ సమస్యలను తెలియజేయాలన్నారు.