Suriya 42 : పది భాషల్లో రిలీజ్ కానున్న సూర్య సినిమా
స్టార్ హీరో సూర్య (Hero Suriya) మరో కొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సూర్య 42(Suriya 42)వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీకి శివ(Shiva) దర్శకత్వం వహిస్తున్నాడు.
స్టార్ హీరో సూర్య (Hero Suriya) మరో కొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కోలీవుడ్(Kollywood)లో సరికొత్త కథల పరంగా కొత్తదనానికి ప్రాధాన్యతనిచ్చేవారిలో సూర్య ముందుంటాడు. ఇప్పటి వరకూ అలాంటి ప్రయోగాలు చేస్తూ ఆయన చాలా సినిమాలు(Movies) చేశాడు. అలాంటి సూర్య 42(Suriya 42)వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీకి శివ(Shiva) దర్శకత్వం వహిస్తున్నాడు.
సినిమా షూటింగ్ (Shooting) ప్రారంభమైనా ఇంకా టైటిల్ మాత్రం ఖరారు చేయలేదు. ఈ మూవీ కథాకథనాలు వైవిధ్యభరితంగా ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. అందుకే టైటిల్ ఎలా ఉంటుందనేది ఫ్యాన్స్ లో ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ కు ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఏప్రిల్ 16వ తేదిన ఉదయం 9 గంటలకు ఈ సినిమా టైటిల్ (Movie Title)ను ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
అడవి ప్రాంతంలో విల్లంబులు ధరించి గుర్రాలపై వేటాడటానికి వెళ్తునటువంటి ఓ వేటగాడు, ఒక కొండ కొస నుంచి ఇంకో కొండపైకి జంప్ చేస్తున్నట్లుగా పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ (Poster Release) చేసింది. పక్కనే ఆ గుర్రాన్ని వెంబడిస్తూ వేటకుక్క కూడా వెళ్తుంటుంది. ఈ మూవీలో నయనతార (Nayanatara), దిశా పటానిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ (Devisri prasad) మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ మొత్తం 10 భాషల్లో విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.