2024 సార్వత్రిక ఎన్నికల్లో (2024 lok sabha elections) బీజేపీ (bjp) మరోసారి 300కు పైగా సీట్లు సాధించి మూడోసారి అధికారంలోకి వస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు (union home minister amit shah). ఆయన అసోంలోని దిబ్రుగర్ లో బీజేపీ కార్యాలయానికి (bjp office) శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో అసోంలో కూడా బీజేపీ 14 స్థానాలకు గాను 12 చోట్ల గెలుస్తుందని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిచి, నరేంద్ర మోడీ (pm narendra modi) మూడోసారి కూడా ప్రధాని అవుతారని స్పష్టం చేశారు. మోడీ పైన ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. ఆయన అంత ఎత్తుకు ఎదుగుతారని, బీజేపీ వృద్ధి చెందుతుందన్నారు. ఈశాన్య రాష్ట్రాలు గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేవని, ఇప్పుడు బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారన్నారు. భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ పాదయాత్ర (rahul gandhi bharath jodo yatra) చేసినా ఇటీవల ఇక్కడి మూడు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ కనుమరుగైందన్నారు. విదేశీ గడ్డ పైన ఆయన భారత్ ను అవమానించారన్నారు. ఆయన తీరు ఇలాగే ఉంటే దేశవ్యాప్తంగా ఆ పార్టీ తుడిచి పెట్టుకుపోవడం ఖాయమన్నారు. దీనిని రాహుల్ బాబా (rahul gandhi) అర్థం చేసుకోవడం లేదన్నారు.
భారత దేశానికి మోడీ (narendra modi) ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపుతో పాటు గౌరవం పెంచారన్నారు. ఈశాన్య ప్రాంతాల్లో ఆయన 50 సార్లకు పైగా పర్యటించారన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో (north east states development) ముందుకు తీసుకు వెళ్తున్నట్లు చెప్పారు. మోడీ మరింత కాలం ఇలాగే పని చేయాలని 130 కోట్ల మంది ప్రజలు ప్రార్థిస్తున్నారన్నారు. అసోంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక 41 వేల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. 12 మెడికల్ కాలేజీలను నిర్మించిందని, మరో 12 నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. ఇప్పుడున్న భారత్ 1962 వంటి దేశం కాదని, మోడీ, అమిత్ షాల భారత్ అని అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ అన్నారు.