KMM: ఖమ్మం నగరం సుందరీకరణ, ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకొని రోడ్ల విస్తరణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ పనులు చాలా వరకు సగంలోనే ఆగిపోయాయి. రిక్కాబజార్, చెరువు బజార్, రైల్వే స్టేషన్ రోడ్డు, PSR రోడ్డు, RTA కార్యాలయ రోడ్ల విస్తరించేందుకు పనులను ప్రారంభించగా.. వీటిలో కొన్ని రోడ్లు వెడల్పు చేయకుండానే నిలిచిపోయాయి.