KDP: ఎర్రగుంట్ల – పొద్దుటూరు మధ్య ఉన్న పెన్నా నదిలో సోమవారం రాత్రి ఫయాజ్ అనే వ్యక్తి గల్లంతయాడు. ఈ మేరకు ప్రొద్దుటూరుకు చెందిన నలుగురు యువకులు చేపలు పట్టడానికి పెన్నా నదికి సాయంత్రం వెళ్లారు. వీరిలో చేపలు పట్టడం కోసం ఫయాజ్ అనే వ్యక్తి నదిలోకి దిగాడు. ముగ్గురు బయట ఉన్నారు. నదిలోకి దిగిన వ్యక్తి కనిపించకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టారు.