GDWL: ఈ నెల 13న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గద్వాల పర్యటన నేపథ్యంలో, సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు పలువురు పార్టీ నాయకులు సోమవారం పాత బస్టాండ్ వద్ద ఉన్న సభా స్థలాన్ని సందర్శించారు. మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, గద్వాల బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జ్ బాసు హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.