W.G: నరసాపురం మండలంలోని తూర్పు తాళ్లు గ్రామంలో ఇటీవల జరిగిన గణేశ్ నిమజ్జనాల్లో గాయపడి కోలుకుంటున్న వారిని నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సోమవారం పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాల ప్రభుత్వ సహాయం అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.