E.G: యూరియా అతి వినియోగం వల్ల కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం నుంచి విస్తృత ప్రచార కార్యక్రమం ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ రూపొందించిన కొత్త యాప్ను రైతులందరూ ఉపయోగించుకునేలా చూడాలని, వాట్సాప్ సేవలను మరింత మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.