ప్రకాశం: జిల్లాలో అన్నదాత పోరును నేడు నిర్వహిస్తున్నట్లు YCP ప్రకటించింది. ఇందులో భాగంగా యూరియా కొరత ఉందంటూ వైసీపీ నిరసన ర్యాలీ చేపట్టనుంది. జిల్లా అధికార యంత్రాంగం మాత్రం జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులకు అందుబాటులో ఉన్నట్లు ప్రకటించింది. కాగా, ఎస్పీ దామోదర్ ఆదేశాలతో ఇటీవల ఎరువుల షాపులపై విస్తృత తనిఖీలు సాగాయి.