WGL: వరంగల్ సైబర్ పోలీసులు పార్ట్ టైం జాబ్ ప్రకటనల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సోమవారం సూచించారు. ఇంట్లో కూర్చొని వేలల్లో సంపాదన అనేది మోసమని, మొదట వందల్లో ఇచ్చి తర్వాత లక్షల్లో దోచేస్తారని హెచ్చరించారు. ఆన్లైన్ టాస్క్‌ల పేరిట మోసాలు జరుగుతున్నాయని, ఇటువంటి జాబ్‌లను నమ్మవద్దని, ఎవరికీ రిఫర్ చేయవద్దని సైబర్ పోలీసులు సూచించారు.