KMR: బీసీలకు కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు అందించి ఉపాధి అవకాశాలు కల్పించాలని, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని జిల్లా మున్నూరు కాపు ప్రతినిధి నీలం నర్సింలు కోరారు. సోమవారం కేంద్ర మంత్రిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి బీసీల సమస్యలను వివరించారు. అనంతరం కేంద్రమంత్రి మాట్లాడుతూ.. నిరుపేద మధ్యతరగతి వారికోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిందన్నారు.