NZB: సిరికొండ మండలం పెద్ద వాల్గేట్–చిన్న వాల్గేట్ రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతినడంతో నిజామాబాద్ బస్సు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అత్యవసరంగా మొరం పోసి రహదారిని మరమ్మతులు చేసింది. దీంతో ఇవాళ్టి నుంచి బస్సు సేవలు మళ్లీ యథావిధిగా ప్రారంభమయ్యాయని R&B ఏఈ గంగాధర్ తెలిపారు.