PLD: ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌కు వ్యతిరేకంగా ఈనెల 9న గురజాల రెవెన్యూ డివిజన్ కార్యాలయం వద్ద రైతులకు మద్దతుగా ‘అన్నదాత పోరు’ నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం మాచర్లలోని కార్యాలయంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. మాచర్లకు చేరుకున్న పిన్నెల్లికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.