AP: విశాఖపట్నంలో ఓ బాలికపై ఇద్దరు వ్యక్తులు దారుణంగా అత్యాచారం చేశారు. బాలిక వారి బారి నుంచి తప్పించుకుని తన తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.