WGL: ఎనుమాముల మార్కెట్ యార్డును నిన్న సాయంత్రం జిల్లా కలెక్టర్ డా. సత్య శారద సందర్శించారు. మిర్చి సీజన్ నేపథ్యంలో మార్కెట్కు పెద్ద సంఖ్యలో వస్తున్న రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్ యార్డులో తాగునీటి సదుపాయం, తగిన షెడ్లు, తూకం ప్రక్రియలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.