జపాన్ ప్రధాని పదవికి షిగేరు ఇషిబా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. పార్టీలో అంతర్గత విభేదాలకు స్వస్తి పలకాలనే లక్ష్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని జపాన్ ప్రభుత్వ రంగ టీవీ NHK వెల్లడించింది. జూలైలో జరిగిన ఎన్నికల్లో అధికారిక లిబరల్ డెమోక్రటిక్ పార్టీ కూటమి పార్లమెంట్ ఎగువ సభలో మెజార్టీని కోల్పోయింది.