NRPT: మరికల్ మండలంలోని చిత్తనూరు శ్రీ రామచంద్రస్వామి దేవాలయం దగ్గర ఆదివారం పౌర్ణమిని పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ వ్రతాలను నిర్వహించినట్లు ఆలయ అర్చకులు శ్రీకాంత్, ఆలయ కమిటీ సభ్యులు లక్ష్మీకాంత్ రెడ్డిలు తెలిపారు. గత 21 నెలలుగా ఈ ఆలయంలో పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.