VZM: ఇవాళ చంద్రగ్రహణం సందర్భంగా జిల్లాలోని అన్ని దేవాలయాలు ఆదివారం మ. 2 గంటల నుంచి మూసివేస్తున్నట్లు దేవాదాయశాఖ సహాయ కమిషనర్ కె. శిరీష తెలిపారు. ఈ రోజు రాత్రి 9:56గం. నుంచి సోమవారం వేకువజాము వరకు గ్రహణం ఉన్నందున జిల్లాలోని అన్ని ఆలయాలు మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం సంప్రోక్షణ అనంతరం ఉ.8.30 గంటలకు తెరుస్తామని చెప్పారు.