ATP: గుంతకల్లు మండలం నక్కల దొడ్డిపంచాయతీలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ శనివారం గుంతకల్లు IOCL చీఫ్ జనరల్ మేనేజర్ సురేష్ పట్నాయక్ను ఆయన నివాసంలో టీడీపీ మండల ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి శనివారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జయరాం ఆదేశాలతో ఐఓసీఎల్ డిపోధికారులకు వినతి పత్రం అందజేశామన్నారు.