GNTR: ఆస్తి పన్ను వసూళ్లపై సోమవారం నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని గుంటూరు మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. శనివారం డిప్యూటీ కమిషనర్లు, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆస్తి, ఖాళీ స్థల పన్నులు, నీటి చార్జీల వసూళ్లలో పురోగతి లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.