కృష్ణా: చల్లపల్లి మండలం లక్ష్మీపురం శివారు చింతలమడ ఎస్సీ కాలనీకి చెందిన నిమ్మగడ్డ హరిప్రసాద్ కడుపునొప్పి తాళలేక ఈనెల ఒకటో తేదీ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ.. శనివారం కన్నుమూశాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేశారు.