KMM: సీపీఎం జిల్లా నాయకుడు, మాజీ కౌన్సిలర్ నర్రా రమేష్ మృతి పట్ల ఖమ్మం బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శనివారం ఆయన రమేష్ భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. రమేష్ మరణం తీరని లోటని పేర్కొన్నారు. ఆయన చేసిన పలు సేవలను కొనియాడారు.