PDPL: ధర్మారం మండలం బంజేరుపల్లికి చెందిన భాస్కర్ నాయక్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇవాళ ధర్మారం వచ్చిన సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు భాస్కర్ నాయక్‌ను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచులు కొమురయ్య, రంజిత్, కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు బొల్లి స్వామి, ఇతర నాయకులు పాల్గొన్నారు.