Prabhas : ఆదిపురుష్ టీజర్ చేసిన డ్యామేజ్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా.. అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్న ఆదిపురుష్ పై పాజిటివ్ బజ్ క్రియేట్ చేయాలంటే.. ఖచ్చితంగా మ్యాజిక్ జరగాల్సిందే. అందుకే లేట్ అయిన పర్లేదు..
ఆదిపురుష్ టీజర్ చేసిన డ్యామేజ్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా.. అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్న ఆదిపురుష్ పై పాజిటివ్ బజ్ క్రియేట్ చేయాలంటే.. ఖచ్చితంగా మ్యాజిక్ జరగాల్సిందే. అందుకే లేట్ అయిన పర్లేదు.. కానీ విజువల్ వండర్‌గా సాలిడ్ అవుట్ పుట్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నాడు దర్శకుడు ఓం రౌత్. అయితే ఈ సారి మాత్రం ఒక్కొక్క అప్డేట్స్ ఇస్తూ.. ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్‌ను చెక్ చేసుకుంటున్నాడు. శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ బాగుందని అనిపించుకున్నప్పటికీ.. ట్రోలింగ్ తప్పలేదు. అయితే హనుమాన్ జయంతికి రిలీజ్ చేసిన పోస్టర్‌కు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే జై శ్రీ రామ్ అంటూ సాగే పాటను నిమిషం డ్యూరేషన్లో రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఆదిపురుష పై కాస్త పాజిటివిటి స్టార్ట్ అయిందనే చెప్పాలి. ఇంతకుముందు ఆదిపురుష్ టీజర్‌లోను జై శ్రీరామ్ సాంగ్ బిట్‌ను వినిపించారు. అందుకే నెక్స్ట్ అప్డేట్గా ఈ సాంగ్‌నే రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను జూన్ 16న రిలీజ్ చేయబోతున్నారు. రిలీజ్ సమయం దగ్గర పడుతుండడంతో.. మెల్లి మెల్లిగా ఒకో అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే జై శ్రీరామ్ ట్యూన్ క్యాచీగా ఉండడంతో.. ఈ సాంగ్‌నే ఫస్ట్ సింగిల్‌గా రిలీజ్ చేస్తున్నట్టుగా లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. నెక్స్ట్ వీక్‌లోనే దీనిపై క్లారిటీ రానుందని అంటున్నారు. ఈ సినిమాకి బాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్స్ అజయ్ మరియు అతుల్ సంగీతం అందిస్తున్నారు. మరి ఆదిపురుష్ ఫస్ట్ సింగిల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.