NRPT: నారాయణపేటలో వినాయక నిమజ్జన ఉత్సవాల సమయంలో అపశృతి చోటుచేసుకుంది. బురుడు వాడి శాసనపల్లి శేఖర్(45) గుండెపోటుతో మృతి చెందాడు. మున్సిపాలిటీ నీటి సరఫరా విభాగంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి అయిన శేఖర్ నృత్యం చేస్తూ కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. ఎస్సై, మాజీ ఛైర్మన్ సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. అధిక శబ్దం కారణంగా ఇలా జరిగి ఉండవచ్చని ఆరోపణలు వస్తున్నాయి.