AP: మాజీ సీఎం జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు చంపేశారంటూ మాజీ మంత్రి విడదల రజినీ మండిపడ్డారు. వైద్యం, టెస్టులు అన్నీ ఫ్రీగా అందించాలన్నదే జగన్ ఆలోచన అని తెలిపారు. చంద్రబాబు మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెడితే ఇక పేదోడి పరిస్థితి ఏంటి అంటూ? ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల కోసం సేకరించిన భూమిని కూడా ప్రైవేటుపరం చేస్తున్నారని.. దీని వెనుక పెద్ద స్కాం ఉందని ఆరోపించారు.