VSP: సింహాద్రి నాధుడి పాదాల చెంత అడవివరం గ్రామంలోని ఆయిల్ మిల్ ప్రాంతంలో గత 42 ఏళ్లుగా వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న శ్రీ గణేష్ యువజన సేవా సంఘం ఈ ఏడాది కూడా ఉత్సవాలను వైభవంగా నిర్వహించింది. ఈ సందర్భంగా శనివారం వేలాది మంది భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింహాచలం దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీనుబాబు పాల్గొన్నారు.