SKLM: యూరియా ప్రణాళికాబద్ధంగా పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఎరువులపై తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎస్సైలు, వ్యవసాయ శాఖ పలు శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఎరువులకు సంబంధించి డివిజన్ స్థాయిలో ఆర్డీవో, డీఎస్పీ, వ్యవసాయ శాఖ ఏడీ ఉంటారన్నారు. అధికారులందరూ క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలన్నారు.