HYD: మాదాపూర్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి పీరంచెరువు వద్ద కొనసాగుతున్న నిమజ్జన ఏర్పాట్లను, బందోబస్తును పరిశీలించారు. రాత్రి గణపతి ప్రతిమలు అధికంగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పకడ్బందీగా ఉండాలని సూచించారు. కిందిస్థాయి అధికారులను జాగ్రత్తలు వహించాలని ఆదేశించారు. మరోవైపు అక్కడే ఉన్న ఎలక్ట్రిసిటీ, జిహెచ్ఎంసీ అధికారులతో సమన్వయంగా ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు.