KRNL: జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా శనివారం కల్లూరు మండలం పర్ల గ్రామంలో పత్తి పంటను పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట స్థితి, ఖర్చులు, దిగుబడి వంటి వివరాలను తెలుసుకున్నారు. రైతు మిన్నల తెలిపిన వివరాల ప్రకారం, 7 ఎకరాల్లో పత్తి సాగు జరుగుతోంది. ఎకరాకు రూ. 40 వేల ఖర్చు అవుతుండగా, వర్షాలు అనుకూలించడంతో పంట బాగా పండిందన్నారు.