VZM: కొత్తవలస వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ సీహెచ్.మల్లునాయుడు అధ్యక్షతన పాలకవర్గం సమావేశం శనివారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారికి పుష్పగుచ్ఛం ఆందజేసి, ఘనంగా సత్కరించారు. గత సమావేశంలో తీసుకొన్న అంశాలు, కొత్తవలసలో రైతు బజార్ ఏర్పాటుపై తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.