ELR: కామవరపుకోట మోడల్ డిగ్రీ కళాశాల బాలికల వసతి గృహాన్ని ఆడమిల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గూడపాటి కేశవరావు శనివారం పరిశీలించారు. విద్యార్థులకు అందించే ఆహార పదార్థాల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. విద్యార్థులకు అందించే వాటిలో లోపాలు లేకుండా సిబ్బంది సహకరించాలన్నారు.