ASF: దహేగాం మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం 37 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను MLA హరీష్ బాబు పంపిణీ చేశారు. MLA మాట్లాడుతూ.. లబ్ధిదారులందరూ వచ్చే దసరా నవరాత్రుల్లో ఇండ్ల పనులను మొదలుపెట్టాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలవుతున్న ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.