NTR: నందిగామ పట్టణంలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 35వ వార్షికోత్సవ మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రధాన అతిథిగా పాల్గొని, భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్నదానం వంటి కార్యక్రమాలు సమాజంలో సౌభ్రాతృత్వాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.