SRD: తెలంగాణ ఉద్యమ నాయకుడు ఎల్లయ్య మృతి కార్మిక రంగానికి తీరనిలోటని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. రామచంద్రాపురం బెల్లో ఎల్లయ్య నివాసానికి వెళ్లి మృతదేహానికి నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమంలో ఎల్లయ్య పాత్ర మరువలేనిదన్నారు. కార్మికుల హక్కుల కోసం ఆయన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు.