NLG: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులు, వారి సహాయకులకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేపాల సతీష్ మాట్లాడుతూ.. అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. విద్యార్థులకు బుక్స్, ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. కందాల పాపిరెడ్డి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.